Monday, October 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్గృహ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎలా గుర్తించాలి.

గృహ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎలా గుర్తించాలి.

📰 Generate e-Paper Clip

ఇంటి నిర్మాణానికి భూపరీక్ష

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఒక ఇల్లు నిర్మించుకొనుటకు ముందే స్థలం కొనుటకు మనం ప్రయత్నిస్తాం. అసలు ఆ స్థలం గృహ నిర్మాణానికి అనువైనాదా కాదా అన్న విషయం భూపరీక్ష ద్వారా తెలుసుకొనవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. భూపరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది.

ఇంటి నిర్మాణ ప్రాంతంలో మట్టి పరీక్ష

గృహ నిర్మాణం చేయాలని భావించే భూమిలో ఒక హస్తము పొడవు, అంతే వెడల్పు, అంతే లోతు గల ఒక గోతిని తవ్వి, ఆ మన్నుతోనే తిరిగి ఆ గోతిని నింపితే.. మట్టి మిగిలితే అది శ్రేష్టమైంది. సరిగ్గా సరి పోతే మధ్యమం, తక్కువ అయితే అధమ ఫలం కలుగుతుంది. అదే గోతిలో జలం పోసి నింపి, నూరడుగులు వేగంగా నడిచి వెళ్లి.. వెనక్కు వచ్చి గొతిని పరీక్షించాలి. నీటిమట్టం తగ్గకపోతే శుభప్రదమని భావించాలి.

ఇంటి నిర్మాణ ప్రాంతంలో దీపం పరీక్ష

గృహం కట్టబోయే స్థలంలో దీపం ఉంచి కూడా పరీక్షించవచ్చు. ప్రమిదలో నేతిని పోసి.. నాలుగు దిక్కులకు నాలుగు ఒత్తులు వేసి వాటిని వెలిగించాలి. అన్ని దిక్కుల్లోని ఒత్తులు సమంగా వెలిగితే సంపూర్ణ ఫలం కలుగుతుంది. 

Follow the Mee Seva Information channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaq07V9DOQIeaJ4pJE3s

తూర్పు ముఖంగా ఉన్న భూమి వైపు అధికంగా వెలిగితే బ్రాహ్మణులకు అనుకూలం. దక్షిణ ముఖం కలిగిన ఒత్తి అధికంగా వెలిగితే అది క్షత్రీయులకు నివాసయోగ్యమైన భూమి. పశ్చిమాభిముఖం కలిగిన ఒత్తి అధికంగా వెలిగితే వైశ్యులకు అనుకులమైన భూమి, ఉత్తరాభి ముఖం కలిగిన వత్తి అధికంగా వెలిగితే శూద్రులకు శ్రేయస్కరం.

ఇంటి నిర్మాణ ప్రాంతంలో ఎన్ని రోజులలో మొక్కలు మొలకెత్తాలి

గృహనిర్మాణం చేయదలచిన వారు భూమిని నాగలితో సమానంగా దున్నాలి. తర్వాత సర్వ బీజములు (విత్తనాలు) నాటాలి. ఆ బీజములు మూడు రాత్రుల్లో మొలకెత్తితే ఉత్తమ భూమి అనొచ్చు. ఐదు రాత్రుల్లో మొలకెత్తితే అధమ ఫలప్రధం అయిన భూమి అని నిర్ధారించాలి. 

భూ పరీక్ష కోసం తిలలు (నువ్వులు), యావలు (కొర్రలు, రాగులు, సజ్జలు, బార్లీ) వాడాలి. సర్వ ధాన్యాలు కూడా చల్లవచ్చు. ఎక్కడ బీజములు మొలకెత్తవో ఆ భూమి వాసయోగ్యం కానిదని భావించాలి. (వడ్లు, శాలి, పెసలు, తిల, యవలు, గోధుమ మొదలైన ధాన్యాలను సర్వ ధాన్యాలు అంటారు.)

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.