[10/9, 08:22] null: *_2002 డీఎస్సీ టీచర్లకు అక్టోబర్ 17 నుంచి 24 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 2002 డీఎస్సీ ద్వారా ఎంపికై, 2002 అక్టోబర్ 17న విధుల్లో చేరిన ఎస్జీటీలు ఈ నెల 16 నాటికి 24 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకోనున్నారు. దీంతో 2026 అక్టోబర్ 17 నుంచి వారికి 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేలు (SPP-II) మంజూరు చేయాల్సి ఉంది. ఈ స్కేలు మంజూరుకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ (GHM Grade-II) పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత విధిగా పొంది ఉండాలి._
24 ఏళ్ల స్కేలుకు అర్హతలు ఇవే
డిగ్రీతో పాటు బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి
అదేవిధంగా EOT, GOT శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వీటితో పాటు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే పై స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదవని వారు ‘Special Language Test for Officers of the Education Department in Higher Standard’ శాఖాపరమైన పరీక్షలో కూడా ఉత్తీర్ణత విధిగా సాధించి ఉండాలి
పూర్తి అర్హతలు ఉన్న వారికి 2026 అక్టోబర్ 17 నుంచి 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేలు (SPP-II) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎంఈఓలు మంజూరు చేయాల్సి ఉంది. ఎక్కడైనా ఎస్జీటీలు ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తుంటే సంబంధిత హైస్కూల్ హెడ్మాస్టర్ 24 ఏళ్ల స్కేల్ మంజూరు చేయాలి.
[10/9, 11:04] null: *💥 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక స్థాయి పోస్టులు 2012 2017 2024 డీఎస్సీలలో కేవలం డిఎడ్ వారితోనే భర్తీ చేయడం జరిగింది.2008 డీఎస్సీలో 30% కోటాతో నియమకాలు జరిగాయి.. LFL హెడ్మాస్టర్ పోస్టులు డీఎడ్ అర్హత కలిగిన SGTలకే కేటాయించాలి
కోర్టు ఉత్తర్వులు మరియు అమలులో ఉన్న నిబంధనలను పక్కనపెట్టి కేవలం ఎమ్మెల్సీ ఓట్ల కోసం బి.ఎడ్ వారికి అవకాశమంటూ ఇలాంటి డిమాండ్లు చేయడం విడ్డూరంగా ఉంది..
సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రాథమిక స్థాయిSGT పోస్టులు డీఎడ్ అర్హత కలిగిన వారికి సంబంధించినవే.2012, 2017, 2024 DSCలలో ఈ విధానం అమలులో ఉంది.
2018–2023 మధ్య కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా బి.ఎడ్ అభ్యర్థులకు SGT పోస్టులకు అవకాశం కల్పించినప్పటికీ, అనంతరం సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది.
ఆ తర్వాత తెలంగాణలో నిర్వహించిన 2024 DSCలో SGT పోస్టులను డీఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులకే కేటాయించారు. గత సంవత్సరం జరిగిన ప్రమోషన్లలో కూడా LFL Headmaster పోస్టులు డీఎడ్ అర్హత కలిగిన SGT ఉపాధ్యాయులకే కేటాయించబడ్డాయి.
అందువల్ల గత నియామకాలలో ఏర్పడిన సమస్యలను ప్రస్తుత కొత్త నియామకాలపై మోపడం సమంజసం కాదు.
భవిష్యత్తులో భర్తీ/ప్రమోషన్ చేయబోయే LFL Headmaster పోస్టులను డీఎడ్ అర్హతతో పాటు TET Paper-I కలిగిన SGT ఉపాధ్యాయులకే కేటాయించాలి.
బి.ఎడ్ అర్హత కలిగిన SGT ఉపాధ్యాయులకు TET Paper-II ఆధారంగా School Assistant పోస్టులకు ప్రమోషన్లు కల్పించాలి.
School Assistant ప్రమోషన్లలో గతంలో అమలులో ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలి.
మిగిలిన ఖాళీ పోస్టులను నిరుద్యోగులకు అవకాశమిస్తూ DSC ద్వారా భర్తీ చేయాలి.

