Monday, October 19, 2026
Homeతెలంగాణఎల్కతుర్తి నుంచి సిద్ధిపేట వరకు ఘనంగా సేవా జ్యోతి యాత్ర

ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేట వరకు ఘనంగా సేవా జ్యోతి యాత్ర

📰 Generate e-Paper Clip

400 బైకులతో కదిలిన బీజేపీ శ్రేణులు – మోదీ గారి ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి సిద్ధిపేట వరకు సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్దతు శ్రీకాంత్ యాదవ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎల్కతుర్తి నుంచి భీమదేవరపల్లి మీదుగా హుస్నాబాద్ చేరుకున్న ర్యాలీలో వివిధ మండలాల నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా బైకులతో పాల్గొన్నారు. హుస్నాబాద్ నుంచి సేవా జ్యోతిని సిద్ధిపేట వరకు కొనసాగించారు.

ఈ ర్యాలీలో ఎల్కతుర్తి మండలం నుంచి సుమారు 60 బైకులు, మొత్తం దాదాపు 400 బైకులతో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మోదీ గారి సేవా స్ఫూర్తి, దేశాభివృద్ధి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహించారు.*

ఈ సందర్భంగా మద్దతు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.