Monday, October 19, 2026
Homeతెలంగాణదామెరలో ఘనంగా ‘అంగన్ మిలాన్’ కార్యక్రమం

దామెరలో ఘనంగా ‘అంగన్ మిలాన్’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

అంగన్వాడీ సిబ్బందికి సన్మానం  చిన్నారులకు అరటిపండ్ల పంపిణీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో దామెర గ్రామంలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా దామెర గ్రామంలో ‘అంగన్ మిలాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామెర గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఘనంగా సన్మానించి, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ కోసం వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, బాలల ఆరోగ్యం మరియు అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని నాయకులు పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, బాలల అభివృద్ధి వంటి అంశాలపై సిబ్బందితో చర్చించారు. సమాజంలోని వివిధ వర్గాల సేవలను గుర్తించి గౌరవించడమే సేవా సంకల్ప అభియాన్ ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చీదురాల వెంకటేష్, కార్యదర్శి చిర్ర శ్రీనివాస్, హింగే దేవరావు, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, కూడుతడి రాజు, ఠాకూర్ శామ్ సింగ్, ఎడ్ల రగోతం రెడ్డి, మద్దె అనిల్, గొర్రె ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత, రమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.