Tuesday, October 20, 2026
Homeతెలంగాణచలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

అక్టోబర్‌ 6న MSF జాతీయ ప్రతినిధుల మహాసభ

భీమ్ ఇండియా టుడే న్యూస్  ఎల్కతుర్తి, అక్టోబర్‌ 3హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో అక్టోబర్‌ 6న నిర్వహించనున్న MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

ఎమ్మార్పీఎస్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్‌ మాదిగ ఆదేశానుసారం శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో MSF నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్టోబర్‌ 6న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా MSF ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొల్లమందల చరణ్‌ మాదిగ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, హక్కులు, విద్యారంగానికి సంబంధించిన అంశాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహిస్తున్న MSF జాతీయ ప్రతినిధుల మహాసభకు ఎల్కతుర్తి మండలం నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగే ఈ మహాసభకు మండలంలోని విద్యార్థులు, MSF ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.