Tuesday, October 20, 2026
Homeతెలంగాణ18 ఏళ్లుగా గ్రామపంచాయతీ సేవల్లో కట్కూరి శ్రీనివాస్

18 ఏళ్లుగా గ్రామపంచాయతీ సేవల్లో కట్కూరి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ కరోనా సమయంలోనూ ప్రజలకు అండగా.. ఉత్తమ సేవ అవార్డు ఇవ్వాలని గ్రామ ప్రజల ఆకాంక్ష

దండేపల్లి: గత 18 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ విధుల్లో బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న కట్కూరి శ్రీనివాస్ సేవలను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

ప్రత్యేకంగా కరోనా విపత్కర సమయంలో ప్రజల సేవకు అంకితమై, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తన వంతు సహాయ సహకారాలు అందించారని గ్రామ ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటూ, సమస్యలను ఓర్పుతో వింటూ తనదైన శైలిలో సేవ చేయడం శ్రీనివాస్ ప్రత్యేకతగా పేర్కొంటున్నారు.

18ఏళ్లుగా గ్రామపంచాయతీ విధుల్లో చూపిన సేవాభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి కట్కూరి శ్రీనివాస్‌కు ఉత్తమ సేవ అవార్డు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు లభిస్తే మరింత మందికి ప్రజాసేవ చేయాలనే స్ఫూర్తి కలుగుతుందని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.