Tuesday, October 20, 2026
Homeతెలంగాణకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రక్షణ చట్టం తేవాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రక్షణ చట్టం తేవాలి.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజురాబాద్ నియోజకవర్గ బిసి జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్

బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బీసీ రక్షణ చట్టం గురించి గురువారం రోజు హుజురాబాద్ పట్టణంలో స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసినసమావేశంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, స్వాతంత్రము సిద్ధించి 79 సంవత్సరములు గడుస్తున్న ప్పటికీ బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండడమే కాకుండా అనుకున్నంత స్థాయిలో ఎదగకపోవడం పట్ల తీవ్ర ఆందోళననువ్యక్తం చేస్తూ, బీసీల పైన జరుగు తున్నటువంటి అగ్రవర్ణ దాడులను ఖండించినారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో తీసుకొని వచ్చి బీసీల పైన దాడులు జరగ కుండా బీసీ రక్షణ చట్టాన్ని దేశమంతటా అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినారు. దేశ జనాభాలో 60 శాతాన్ని మించి ఉన్నటువంటి బీసీ ప్రజలు అతి తక్కువ శాతం రాజ్యాధికారాన్ని పొందు చున్నందున స్థానిక సంస్థల తో పాటు చట్టసభలలో బీసీలకు కనీసం 50శాతం రిజర్వేషన్లు అమలు జరుగునట్లు చూడడంతో పాటు విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా ఇదే దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుగునట్లు తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుస్పందించి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని లేనిచో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, హుజురాబాద్ బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉపాధ్యక్షులు కొలిపాక క్రాంతి కుమార్, మాము నూరి ప్రవీణ్ కుమార్, తాళ్లపల్లి రమేష్, మంచి కట్ల మురళి, చిలుక మారి శ్రీనివాస్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజక వర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియ దర్శిని, మంద బిక్షపతి (కె.ఆర్), కానుగంటి శ్రీనివాస్, గోస్కుల మధుకర్, గరవేనా శ్రీకాంత్, కన్నెబోయిన రాజయ్య, దాసరి మల్లేశం, పిల్లి రాజు, రావుల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.