Tuesday, October 20, 2026
HomeతెలంగాణEMI పద్ధతిలో లంచం.. రూ.63 వేలతో CDPO ఏసీబీకి చిక్కింది

EMI పద్ధతిలో లంచం.. రూ.63 వేలతో CDPO ఏసీబీకి చిక్కింది

📰 Generate e-Paper Clip

అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ రిపోర్టులు నెగటివ్‌గా ఇవ్వకుండా నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ రిపోర్టులు అనుకూలంగా ఇచ్చేందుకు నెలనెలా లంచం తీసుకుంటున్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దారోజు పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పట్టణ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో రిపోర్టులు నెగటివ్‌గా ఇవ్వకుండా ఉండేందుకు ఒక్కో అంగన్‌వాడీ నిర్వాహకురాలి నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని CDPO పద్మ ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం 21 మంది అంగన్‌వాడీ నిర్వాహకులతో నెలవారీ చెల్లింపులకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఇలా నెలకు రూ.21 వేల చొప్పున మూడు నెలలకు సంబంధించిన మొత్తం రూ.63 వేల లంచాన్ని సోమవారం ఆమెకు అందజేస్తుండగా ముందస్తు సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే దారోజు పద్మను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ నెలవారీ వాయిదాల తరహాలో లంచం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ ఘటన మెట్‌పల్లిలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.