EMI పద్ధతిలో లంచం.. రూ.63 వేలతో CDPO ఏసీబీకి చిక్కింది
అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ రిపోర్టులు నెగటివ్‌గా ఇవ్వకుండా నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ భీమ్ ఇండియా టుడే న్యూస్ జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ రిపోర్టులు అనుకూలంగా ఇచ్చేందుకు నెలనెలా లంచం తీసుకుంటున్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దారోజు పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పట్టణ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే...