Monday, October 19, 2026
Homeతెలంగాణచాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.. పోరాట స్ఫూర్తిని తరతరాలకు చాటాలి

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.. పోరాట స్ఫూర్తిని తరతరాలకు చాటాలి

📰 Generate e-Paper Clip

ఘనంగా విగ్రహ ప్రారంభోత్సవం – ప్రజాయుద్ధం ఏపూరి సోమన్న

భీమ్ ఇండియా టుడే న్యూస్ నూతనకల్: చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని చింతబజార్‌లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కరుణశ్రీ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజాయుద్ధం ఏపూరి సోమన్న చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలని అన్నారు. ఆమె చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్ చైర్మన్ తేగల గిరిధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కరుణశ్రీ, రజక సంఘం అధ్యక్షుడు వీరమల్ల వెంకన్న, మహేష్, ఉపాధ్యాయులు, వీరస్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.