చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.. పోరాట స్ఫూర్తిని తరతరాలకు చాటాలి
ఘనంగా విగ్రహ ప్రారంభోత్సవం – ప్రజాయుద్ధం ఏపూరి సోమన్న భీమ్ ఇండియా టుడే న్యూస్ నూతనకల్: చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని చింతబజార్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కరుణశ్రీ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజాయుద్ధం ఏపూరి సోమన్న చేతుల...