Monday, October 19, 2026
Homeతెలంగాణబీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

📰 Generate e-Paper Clip

బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు.. దరఖాస్తులకు మరో 4 రోజులే!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణలోని బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాన్ని అమలు చేస్తోంది. ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్‌’ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నారు.

ఈ పథకం కింద కుట్టుమిషన్‌ పొందేందుకు అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్‌ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన మహిళలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

ఆదాయ పరిమితి ఇలా..గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

కుట్టుమిషన్‌ ద్వారా మహిళలు ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

సంప్రదింపుల కోసం:📞 9515555569

ముఖ్య గమనిక: దరఖాస్తు చేసే ముందు అధికారికంగా అర్హతలు, దరఖాస్తు విధానం, గడువు వివరాలను సంబంధిత అధికారుల వద్ద నిర్ధారించుకోవడం మంచిది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.