Monday, October 19, 2026
Homeతెలంగాణవరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు.

 వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. 

పనులకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, ఇకనుంచి ప్రతిరోజూ ఆసుపత్రి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ గారిని ఆదేశించారు.

 భవన నిర్మాణం విషయంలో శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు అహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అవసరమైన విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.

 సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ తరహాలో వరంగల్ ఆసుపత్రిలో కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని, అందుకు సంబంధించి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే హాస్పిటల్ నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. 

 ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి గారితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.