Thursday, September 10, 2026
Homeతెలంగాణఎస్టిమేషను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టారు.

ఎస్టిమేషను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టారు.

📰 Generate e-Paper Clip

సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు పలు గ్రామాల్లో ఇరిగేషన్ పనుల పరిశీలన – ఎస్టిమేషనల్ సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం, సెప్టెంబర్ 7: ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన పనులకు సంబంధించి ఎస్టిమేషను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టారు.

కేశపూర్ గ్రామంలోని పెద్ద చెరువు ఇరిగేషన్ ఛానల్‌కు గతంలో చేసిన ప్రతిపాదనపై వివరాలు తెలుసుకుని, ప్రస్తుతం జంగిల్ పెరిగి కాలువకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో తిరిగి ప్రపోజల్ సిద్ధం చేసి ఎస్టిమేట్ పంపేందుకు పరిశీలన చేపట్టారు.

దండేపల్లి గ్రామంలోని ఊర చెరువు మార్గంలో జంగిల్ అధికంగా ఉండటంతో అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి ఎస్టిమేషను రూపొందించారు. అలాగే తుర్క పల్లె నుండి ఊర చెరువు మత్తడి వరకు చెరువు లోపలికి వెళ్లడానికి అవసరమైన పనులకు కూడా ఎస్టిమేషన్ సిద్ధం చేశారు.

ఎల్కతుర్తి గ్రామంలో అనంతసాగర్ వాగు నుంచి ఊర చెరువుకు వచ్చే కాలువను పరిశీలించారు. కాలువపై కూలిపోయిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిర్మాణానికి ఎస్టిమేషన్ రూపొందించారు.

గోపాల్పూర్ గ్రామంలో చెక్‌డ్యామ్‌కు సంబంధించిన పనులను పరిశీలించి, అవసరమైన ఎస్టిమేషన్ తయారు చేశారు. ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాల్లో సాగునీటి సమస్యలు తగ్గి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో CE కరీంనగర్ సత్యనారాయణ, SEపళ్లెం రాజు, EE హుస్నాబాద్ వెంకట కృష్ణారావు, ఎల్కతుర్తి DE కవిత, AEEలు 

రవిచదురు సామంతూ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు, బ్రిడ్జిల అభివృద్ధి పనులకు త్వరితగతిన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గ్రామాల రైతులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.