భీమ్ ఇండియా టుడే న్యూస్ జగిత్యాల ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డును శంకరపట్నం మండలం, *తాడికల్ గ్రామానికి చెందిన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన శ్రీ వోడ్నాల లక్ష్మణస్వామి అందుకున్నారు.
చిన్నప్పటి నుండి చదువులో *క్లాస్ ఫస్ట్* గా నిలుస్తూ, ఎన్నో కష్టాలను అధిగమించి ఉపాధ్యాయుడిగా ఎదిగిన ఆయన, గత *24 సంవత్సరాలుగా* క్రమశిక్షణ, అంకితభావంతో విద్యాబోధన చేస్తూ ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో *జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి (DEO)* గారి చేతుల మీదుగా లక్ష్మణస్వామి గారికి అవార్డు, ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ గారు మాట్లాడుతూ “నిరుపేద కుటుంబం నుండి వచ్చి 24 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న లక్ష్మణస్వామి గారు యువ ఉపాధ్యాయులకు స్ఫూర్తి” అని కొనియాడారు. అడిషనల్ కలెక్టర్, DEO గారు కూడా ఆయన సేవలను అభినందించారు.

