జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా తాడికల్ వాసి వోడ్నాల లక్ష్మణస్వామి*

భీమ్ ఇండియా టుడే న్యూస్ జగిత్యాల  ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డును శంకరపట్నం మండలం, *తాడికల్ గ్రామానికి చెందిన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన శ్రీ వోడ్నాల లక్ష్మణస్వామి అందుకున్నారు. చిన్నప్పటి నుండి చదువులో *క్లాస్ ఫస్ట్* గా నిలుస్తూ, ఎన్నో కష్టాలను అధిగమించి ఉపాధ్యాయుడిగా ఎదిగిన ఆయన, గత *24 సంవత్సరాలుగా* క్రమశిక్షణ, అంకితభావంతో విద్యాబోధన చేస్తూ ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ...