Thursday, September 10, 2026
Homeతెలంగాణభూములిచ్చిన రైతులను గుర్తించి ముఖ్యమంత్రి  వారితో మాట్లాడారు

భూములిచ్చిన రైతులను గుర్తించి ముఖ్యమంత్రి  వారితో మాట్లాడారు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ నారాయణపేట్ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  పరిశీలించారు. పదేళ్ల కిందట ప్రజల అవసరాల కోసం సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించగా, ఆ స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు. 

 జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి  పాఠశాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి ప్రాంగణమంతా కలియతిరిగారు. స్థానికులందరితో మాట్లాడి వారి నుంచి విజ్ఞాపనలను తీసుకున్నారు. గతంలో భూమి కొనుగోలు చేసిన సందర్భంగా భూములిచ్చిన రైతులను గుర్తించి ముఖ్యమంత్రి  వారితో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.