Saturday, August 29, 2026
Homeతెలంగాణబంధానికి ప్రతిరూపంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

బంధానికి ప్రతిరూపంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు, సీతక్క కొండా.సురేఖ ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన

హైదరాబాద్: సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. బంధానికి ప్రతిరూపంగా నిలిచిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క), శ్రీమతి కొండా సురేఖ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ కట్టడం ద్వారా సోదరభావం, ఆత్మీయత, పరస్పర నమ్మకాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా మహిళా ప్రతినిధులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు.

రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.చూపు లేకపోయినా ఆత్మీయతకు, ప్రేమకు హద్దులు లేవని చాటుతూ ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయతను ముఖ్యమంత్రి సంతోషంగా స్వీకరించి, వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం కాదు.. ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, బాధ్యతలతో ముడిపడిన పవిత్ర బంధానికి ప్రతిరూపం. అలాంటి పవిత్రమైన బంధానికి ప్రతీకగా జరిగిన ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయతను చాటిచెప్పాయి.

మహిళా ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థినులు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టడంతో జూబ్లీహిల్స్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రేమాభిమానాలు, సోదరభావం, ఆత్మీయతల మధ్య రక్షాబంధన్ వేడుకలు ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.