Friday, August 28, 2026
Homeతెలంగాణసద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ ఆశీర్వాదం పొందిన అర్చక సంఘం ప్రతినిధులు

సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ ఆశీర్వాదం పొందిన అర్చక సంఘం ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

  జగద్గురువుల అనుగ్రహంతో సమాజ అభివృద్ధికి కృషి:సదానిరంజన్ సిద్ధాంతి 

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కుతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆలయ అర్చకులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ వీరశైవ జంగమ దూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు బిచ్కుంద సంస్థానానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ ష బ్రా 108 సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొంగళ్ళమటం రాజేంద్రప్రసాద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సదానిరంజన్ సిద్ధాంతి,రాష్ట్ర కోశాధికారి విభూది ప్రభులింగం తదితర సంఘ సభ్యులు స్వామివారిని కలిసి సంఘ కార్యకలాపాలు,లక్ష్యాలు,భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు.ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు వీరశైవ జంగమ దూప దీప నైవేద్య అర్చకుల సంక్షేమం,ఆధ్యాత్మిక అభివృద్ధి, సంప్రదాయ పరిరక్షణతో పాటు వీరశైవ జంగమ సమాజ అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మహాస్వామీజీకి వివరించారు.సంఘం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలు,అర్చకుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి,సమాజాన్ని మరింత సంఘటితం చేసేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేశారు.మహాస్వామీజీ స్వామివారిని సంఘ ప్రతినిధులు దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సంఘం సభ్యులందరూ ఐక్యతతో పనిచేసి వీరశైవ జంగమ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు జంగమ అర్చకుల సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,ధార్మిక సేవలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.అర్చకులు కేవలం దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే వారిగానే కాకుండా,సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా సేవలందించాలని మహాస్వామీజీ సూచించారు.ధర్మం, ఆధ్యాత్మికత,సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని హితబోధ చేశారు. సంఘ సభ్యులు పరస్పర సహకారంతో ముందుకు సాగితే మరింత బలమైన సంఘటిత వ్యవస్థను నిర్మించవచ్చని పేర్కొన్నారు.అనంతరం మహాస్వామీజీ సంఘ ప్రతినిధులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి,ధార్మిక సేవల్లో నిబద్ధతతో కొనసాగాలని ఆశీర్వదించారు. వీరశైవ జంగమ సమాజ అభివృద్ధి కోసం సంఘం చేపట్టే కార్యక్రమాలకు జగద్గురువుల సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొంగళ్ళమటం రాజేంద్రప్రసాద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానిరంజన్ సిద్ధాంతి,రాష్ట్ర కోశాధికారి విభూది ప్రభులింగం మహాస్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు.స్వామివారి సూచనలు, ఆశీర్వచనాలను స్ఫూర్తిగా తీసుకుని అర్చకుల సంక్షేమం, వీరశైవ జంగమ సమాజ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర్,సతీష్,నాగభూషణం,శివప్రసాద్ బిచ్కుంద సంస్థానానికి చెందిన సభ్యులు, భక్తులు, అర్చక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.