భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రశ్నించే బుద్ధిxపురోగతిని అడ్డుకునే అంధత్వం
దిమాగీ నక్సల్ అంటే—తుపాకీ పట్టే చేయి కాదు,ప్రశ్నను వెలిగించే మెదడు;బెదిరింపులకి తలవంచని తెగింపు ,అన్యాయాన్ని చూసి సహించలేని మనస్సు.ఎందుకు?” అని అడిగే పెదవులు,ఎలా మార్చాలి?” అని రగిలే ఆలోచనలు, పేదవాడి ఆకలిని తన సమస్యగా భావించే హృదయాలు,దేశ అభివృద్ధిని ప్రజల అభివృద్ధితో కొలిచే దృష్టి.కులం గోడలు కూలాలని, మతం పేరుతో మనుషులు విడిపోకూడదని, పుట్టుక కాదు—ప్రతిభ, సమానత్వం, మానవత్వమే మనిషి విలువ కావాలని చెప్పే గొంతే దిమాగీ నక్సల్. అవినీతి ముందు అమ్ముడుపోని మనస్సు; అధికారం ముందు వంగని వెన్నెముక; ప్రశ్నలకు సమాధానం చెప్పే పారదర్శక పాలన కోసం నిలబడే పౌర చైతన్యం.నా దేశం బలపడాలని, ప్రతి పేదవాడి బిడ్డ చదవాలని, రైతు గౌరవంగా బతకాలని, కార్మికుడి చెమటకు విలువ ఉండాలని, ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు దక్కాలని బిగిసిన పుడికిలి — జైత్ర యాత్రలో దిమాగీ నక్సల్. కానీ—”దిమాగీ గులాం”* అంటే—’ఆలోచనకు తాళం,ప్రశ్నకు సంకెళ్లు,నమ్మకం పేరుతో నిజాన్ని నిరాకరించే బానిసత్వం.కులం విధానం నిజమని, మతం చెప్పింది తుదిసత్యమని, విద్వేష ప్రచారన్ని శాసనమని, మెరిసే నాయకులు చెప్పిందే వేదమని—తన మెదడును ఇతరుల చేతుల్లో పెట్టేయడం దిమాగీ గులాం.మనిషిని చూడకుండా అతని కులాన్ని చూడటం; మాటను వినకుండా మాట్లాడిన వ్యక్తి పేరును చూడటం; సాక్ష్యాన్ని అడగకుండా అపోహను నమ్మటం;వాస్తవాన్ని పరిశీలించకుండా వదంతిని పంచటం—అంధత్వానికి అగ్రతాంబూలం, అహంకారం తో ఆరాజకం, అధికారం ఇచ్చి అందలం ఎక్కించినా, అధిపతి ఆలోచన చిన్నదైతే దేశం ఎత్తుకు ఎదగేది ఎన్నడూ?జెండా రంగు మార్చేస్తామంటూ,మనసులోని కులగోడ మారకపోతే సమాజం మారది ఎన్నడూ .నినాదాలు వేలైనా, లక్ష అయినా అవినీతిపై ప్రశ్న ఒక్కటి లేకపోతే ప్రజాస్వామ్యం బలపడడేది ఎన్నడూ ఒక దిమాగి నగ్జల్ అడుగుతాడు— “ఇది నిజమా.మరొక దిమాగి గులాం అంటాడు—మా వాళ్లు చెప్పారు… కాబట్టి నిజమే!”ఒక దిమాగి నగ్జల్ సాక్ష్యాన్ని వెతుకుతాడు, మరొక దిమాగి గులాం మూఢనమ్మకాన్ని అశ్రయిస్తాడు.ఒకడు రాజ్యాంగాన్ని చదువుతాడు,మరొకడు వ్యక్తి పూజలో మునిగివుంటాడు .ఒకడు సమాజాన్ని మార్చాలని చూస్తాడు,మరొకడు తన బానిసత్వాన్ని సంప్రదాయం పేరుతో కాపాడుకోవాలంటాడు.దిమాగీ నక్సల్—ప్రశ్నించే ప్రజాస్వామ్య బుద్ధి.దిమాగీ గులాం —ప్రశ్నించకుండా నమ్మే మానసిక బానిసత్వం.దేశాన్ని కూల్చేది ఎప్పుడూ బయటివారే కాదు;కొన్నిసార్లు మన మెదడులో పెరిగినఅంధ నమ్మకమే!’దేశాన్ని నిర్మించేది ఎప్పుడూ ఇటుకలు కాదు;కొన్నిసార్లుఒక చిన్న ప్రశ్న—ఒక నిజాయితీ గల ఆలోచన—ఒక ధైర్యమైన నిరాకరణ.కాబట్టి— కులం కంటే మానవత్వాన్ని ఎంచుకో,మూఢనమ్మకం కంటే సత్యాన్ని ఎంచుకో,వ్యక్తిపూజ కంటే సిద్ధాంతాన్ని ఎంచుకో,అవినీతి కంటే నిజాయితీని ఎంచుకో,బానిసత్వం కంటే ప్రశ్నను ఎంచుకో.ఎందుకంటే—ప్రశ్నించే మెదడు దేశానికి శత్రువు కాదు;ప్రశ్నించకుండా బానిసయ్యే మెదడే దేశ పురోగతికి అడ్డుగోడ.దిమాగీ నక్సల్ —చీకటిని ప్రశ్నించే దీపం.దిమాగీ గులామీ —దీపం వెలిగినాకళ్లను మూసుకునే చీకటి.దేశం నిజంగా ఎదగాలంటే—ముందుగా రోడ్లు కాదు,ఆలోచనలు నిర్మించాలి;ముందుగా భవనాలు కాదు,వివేకం నిర్మించాలి;ముందుగా నాయకులను కాదు,బాధ్యతగల పౌరులను నిర్మించాలి.అప్పుడు మాత్రమే అభివృద్ధి గణాంకం కాదు—
ప్రతి పేదవాడి జీవితంలో కనిపించే
సజీవమైన సమానత్వం అవుతుంది.అందుకే “దిమాగీ నక్సల్”ఒక ముద్ర కాదు—ప్రశ్నించే పౌరుడికి గర్వకారణమైన గుర్తింపు అవుతుంది.

