భీమ్ ఇండియా టుడే న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉయూరు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం::: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు.
ఉయ్యూరు జెడ్ పి హెచ్ పాఠశాలలోవ్యాపార వేత్త దండమూడి కిషోర్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నసరస్వతి దేవి విగ్రహా నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు శంకుస్థాపన చేశారు.
అనంతరం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని అందుకనే ఎన్నికలలో ఇచ్చినహామీ నీ నిలబెట్టుకుంటూ మెగా డీఎస్సీ ని పారదర్శకం గా నిర్వహించి సుమారు పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేశారని అంతే కాకుండా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పాఠశాలలో కూడా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, మరియు మౌలిక సదుపాయాలు కల్పించారని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నాగేశ్వరావు గారు,దండమూడి కిషోర్ గారు, స్కూల్ ఛైర్మెన్ ఆరేపల్లి శివ సాయి ,మరియు ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.

