Friday, August 28, 2026
Homeతెలంగాణకౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ళ దెబ్బలు తప్పవు... వొడితల ప్రణవ్..

కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ళ దెబ్బలు తప్పవు… వొడితల ప్రణవ్..

📰 Generate e-Paper Clip

కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ళ దెబ్బలు తప్పవు… వొడితల ప్రణవ్..

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  డబుల్ ఇళ్ల విషయంలో కౌశిక్ రెడ్డి దొంగ డ్రామాలు.

 ఎమ్మెల్సీగా,విప్ ఉన్నా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు పంచలేదో సమాధానం చెప్పాలి..అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజం అవుతుందనే భ్రమలో ఉన్నాడు.

 మంత్రుల ముందు కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు..

 ఎమ్మెల్సీగా,విప్ గా,ఇప్పుడు ఎమ్మేల్యేగా పూర్తి స్థాయిలో విఫలం..

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ముమ్మాటికి కాంగ్రెస్ తోనే సాధ్యం… సోషల్ మీడియాలో సోకులు తప్ప ప్రజల బాగోగులపై ధ్యాస లేదు..హుజురాబాద్ నియోజవర్గ అభివృద్ధి కొరకు నిత్యం మంత్రులతో,అధికారులతో మాట్లాడుతూ వారిని ఒప్పించి,అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే విషయంలో తాము కృషి చేస్తుంటే వచ్చిన మంత్రుల ముందు హుజురాబాద్ నియోజవర్గ పరువు కౌశిక్ రెడ్డి తీసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.జమ్మికుంట మండల పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో ప్రణవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లు విషయంలో రెండున్నర ఏళ్ళు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉండి పేదలకు ఇళ్లను ఎందుకు పంచలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నిజాలు మాట్లాడడం ఇష్టం లేని కౌశిక్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని,2017లో డబుల్ బెడ్ రూం ఇళ్లు సగం కట్టి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఇంచార్జ్ మంత్రుల సహకారంతో నిధులు మంజూరు చేపించి ఇప్పుడు గృహ ప్రవేశాలకు వెళ్తుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని,కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా,విప్ గా అధికారంలో ఉండి కూడా చేయలేకపోయాడనీ తాము చేస్తుంటే ప్రజలకు పంచకుండా అడ్డుపడ్డడం ప్రజలు గమనించాలని కోరారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మేల్యే గా హుందాతనంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధి ప్రజల సంక్షేమానికి విరోధకంగా వ్యవహరించడం సిగ్గు చేటని,ఇలాంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.రానున్న రోజుల్లో ఇప్పుడు పంపిణీ చేసిన డబుల్ ఇళ్లతో పాటు జమ్మికుంట,హుజురాబాద్,బుజునూర్ గ్రామంలో కట్టిన ఇళ్లకు నిధులు కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామని అన్నారు.వీటితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షుడు పరశురాం,పట్టణ అధ్యక్షడు సుంకరి రమేష్,హుజురాబాద్ మండల అధ్యక్షుడు కిరణ్,వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న-సదానందం,వైస్ చైర్మన్ సత్తి రెడ్డి,డైరెక్టర్లు,మహిళ మండల అధ్యక్షురాలు స్వప్న,మహిళా నాయకురాల్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.