భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ ప్రజా కవి, ప్రజాగాయకుడు స్వర్గీయ గద్దర్ (గుమ్మడి విఠల్) గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.
గద్దర్ తన పాటను ప్రజల గొంతుకగా, తన కళను సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలిచిన మహనీయుడని గుర్తుచేసుకున్నారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.
కాలం మారినా, తరాలు మారినా గద్దర్ గళం ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, వారి గానం, సాహిత్యం, పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. గద్దర్ గారి ఆలోచనలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజ మార్పు కోసం చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.

