Friday, August 28, 2026
HomeEditorialవిద్యే పెద్ద ఆయుధం.. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంజేపీ సెక్రటరీ సైదులు

విద్యే పెద్ద ఆయుధం.. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంజేపీ సెక్రటరీ సైదులు

📰 Generate e-Paper Clip

విద్యే పెద్ద ఆయుధం.. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంజేపీ సెక్రటరీ సైదులుభీమ్ ఇండియా టుడే ప్రతినిది:-. నీరుపేద విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సహాయం చేయాలని పిలుపు – నిరక్షరాస్య తల్లిదండ్రులు పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచన

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారని మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) సెక్రటరీ సైదులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడం తెలియక ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులు, సిబ్బంది సహాయం అందించాలని సూచించారు.

నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సైదులు కోరారు. “చదువే జీవితాన్ని మార్చే పెద్ద ఆయుధం. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి మేమున్నాం. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా కృషి చేయడం అందరి బాధ్యత అని సైదులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.