రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ :- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య* పిలుపు
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు
ఆర్డీవో గారికి *బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని* ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించనైనది ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న
హుజురాబాద్ *బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్మెంట్ మూలంగా ఏర్పడిన గ్రూప్ వన్ గ్రూప్ టు ఖాళీలతో పాటు మిగతా పోస్టుల ఖాళీలను గత కొన్ని సంవత్సరంల నుండి భర్తీ చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు కొత్త జిల్లాలు మండలాలలో ఉద్యోగ ఖాళీలను ఇప్పటివరకు భర్తీ చేయకపోవడమే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ చేయకపోవడం మూలంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గా విద్యార్థులు ఎంతో నష్టపోతారని ఆవేదనను వ్యక్తపరచి నారు అదేవిధంగా పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం మూలంగా శాంతిభద్రులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఇబ్బంది జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు
కార్యక్రమంలో కన్నెబోయిన రాజయ్య కన్నెబోయిన సమ్మయ్య కన్నబోయిన సదానందం తదితరులు పాల్గొన్నారు.

