Friday, August 28, 2026
HomeEditorialభారతదేశ రాష్ట్రాల అతిపెద్ద ఆర్ధికవ్యవస్థల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం

భారతదేశ రాష్ట్రాల అతిపెద్ద ఆర్ధికవ్యవస్థల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం

📰 Generate e-Paper Clip

  • బీమ్ ఇండియా టుడే ఆంధ్రప్రదేశ్:-  కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం… భారతదేశ రాష్ట్రాల అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం & తెలంగాణా 9వ స్థానం దక్కించుకున్నాయి !

రాజధాని లేదా ఎకనమిక్ గ్రోత్ సెంటర్ లేని మన రాష్టం… 8వ స్థానంలో ఎలా నిలబడింది !?

రాపిడ్లీ డెవలపింగ్ & ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ లేకపోతే తెలంగాణా ఏ స్థానంలో ఉంటుంది !?

మరో రెండేళ్లలో రాజధానికి ఒక రూపు వచ్చేస్తుంది !మరో ఏడాదిలో పోలవరం పూర్తైపోతుంది !ఇప్పటికే పూర్తైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు వచ్చే ఏడాదికి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిద్దమౌతుంది !

క్వాంటం వ్యాలీ, డ్రోన్ సిటీ, క్రిస్ సిటీ, శ్రీసిటీ, మెడ్ టెక్ సిటీ !

విశాఖలో కొలువుతీరుతున్న ప్రఖ్యాత గూగుల్, TCS, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని తదితర ఐటీ కంపెనీలు !

రాయల్ ఎన్ ఫీల్డ్ తో పాటు AMNS & JSW స్టీల్ ప్లాంట్లు !

ఇంకా లిస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది !!మరో 3 ఏళ్ళకి మన రాష్ట్రం ఎలా ఉండబోతోందో… ఇప్పటికే మీకు ఒక పిక్చర్ వచ్చేసుంటుంది !! 68,47,190 మంది విద్యార్థులు..

42,70,802 మంది తల్లులు..10,120 కోట్ల నిధులు..ఇదీ Nara Lokesh ఆంధ్రప్రదేశ్ లోని తల్లులకు చేస్తున్న వందనం..పిల్లల చదువుల బాధ్యతను తీసుకున్న వైనం.

గత ప్రభుత్వం లో కూడా దాదాపు గా తల్లుల సంఖ్య ఇంతే 42 లక్షలకు అటు ఇటుగా ఉండేది కాని అప్పుడు జగన్న అమ్మఒడి అంటూ ఖర్చు చేసింది సంవత్సరానికి 6200 – 6400 కోట్లు మొత్తంగా 5 సంవత్సరాలకి గాను 32 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సివుంటే ఆ ప్రభుత్వం చేసింది 26 వేల కోట్లు మాత్రమే.

కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో చేసిన ఖర్చు 20,261 కోట్లు..అంటే కూటమి ప్రభుత్వం తమ 5 ఏళ్ల లో జగన్ ప్రభుత్వం పెట్టిన ఖర్చుకి దాదాపుగా డబుల్ ఈ పథకానికి ఖర్చు పెట్టబోతుంది.

అప్పట్లో 10th వరకు మాత్రమే ఉండే లబ్ధిదారుల లిస్ట్ లో ఇంటర్ విద్యార్థులను కూడా చేర్చడం..అంగన్వాడీ వర్కర్స్..హెల్పర్స్… శానిటేషన్ వర్కర్స్ పిల్లలని కూడా ఈ పథకంలో చేర్చడం లాంటివి కూటమి ప్రభుత్వానికి సంక్షేమం పట్ల వున్న నిబద్ధతకు నిదర్శనం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు  గర్వపడుతున్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.