Friday, August 28, 2026
HomeEditorialబహుజనులంతా సంఘటితం కావాలి.* *మహనీయుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం*

బహుజనులంతా సంఘటితం కావాలి.* *మహనీయుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం*

📰 Generate e-Paper Clip

Ln


*తగరం శంకర్ లాల్ బహుజన సేన
రాష్ట్ర నాయకులు

(పెద్దపల్లి బీమ్ ఇండియా టుడే)

తెలంగాణలోని బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ తగరం శంకర్ లాల్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1902 లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఛత్రపతి సాహు మహారాజ్ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నేటి పాలకులు 85 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా చేస్తూ వారిని దేశ సంపదకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గార్ల స్ఫూర్తితో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ని పురస్కరించుకొని బహుజన సేన ఆద్వర్యంలో హైదారాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే సదస్సుకు ప్రజాస్వామిక వాదులు, బహుజన సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది డాక్టర్ కదిరే కృష్ణ గార్లు హాజరవుతున్నారు. అంతకుముందు సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు నల్లవెల్లి శంకర్ బీసీ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, నోమూరి శ్రీధర్ బీసీ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు,
నూనె కుమార్ మాజీ సర్పంచ్ కేసనపల్లి,
ఆసం తిరుపతి సీనియర్ బహుజన నాయకులు , కట్కూరి సందీప్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం నాయకులు ,
గద్దల శంకర్ దళిత బంధు క్రమశిక్షణ సంఘం రాష్ట్ర నాయకులు ,
సంకెనపల్లి లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ,
బి. లక్ష్మణ్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు,
లింగంపల్లి శంకర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,
రాగమల్ల మధుకర్, దొడ్ల రమేష్, కోల శ్రీనివాస్,కొంకటి లింగమూర్తి సామాజిక ఉద్యమకారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.