Monday, October 19, 2026
HomeEditorialబతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌-2026 అవార్డుల ప్రదానోత్సవానికి

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌-2026 అవార్డుల ప్రదానోత్సవానికి

📰 Generate e-Paper Clip

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌-2026 అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌-2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేపథ్యంలో యువ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్‌ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా యువ ఫిల్మ్ మేకర్స్‌లోని సృజనాత్మకతను వెలికితీసి, వారి ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించనున్నారు.

తెలంగాణ చలనచిత్ర రంగ అభివృద్ధితో పాటు యువతలోని సినీ ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకోనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.