భీమ్ ఇండియా టుడే న్యూస్ స్పెషల్ స్టోరీ హైదరాబాద్ కాంగ్రెస్ వల్లనే కరవు వచ్చిందని బీఆర్ఎస్ అనడం వాళ్ల పైశాచిక ఆనందానికి ఇది నిదర్శనం..
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలతో పాటు బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందా..?
అక్కడ ఎలా ఏ సమస్య ఉంది?
100 దేశాల్లో ఎల్ నినో ఈ సమస్య ఉంది..
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు..
అబద్ధాలతోనే అధికారంలోకి రావాలని, ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు..
ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్లి శుద్రపూజలు చేశారో, చేతబడి చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ప్రజలు అమాయకులు కాదు..
2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలు చాలని ఎవరు సంతకం పెట్టారు? సంతకం పెట్టినవాడు మనిషేనా?
శాశ్వతంగా తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసింది ఎవరు?
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను శాశ్వతంగా ధారాదత్తం చేసింది మీరు కాదా?
చంద్రబాబు ముందు మోకరిల్లి సంతకం పెట్టింది మీరు..
రోజమ్మ రాగి సంకటి పెడితే రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది మీరు..
పాలమూరుకు నీళ్లు ఇవ్వాలని ఒక్కరోజైనా మాట్లాడారా?
పాలమూరు-రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, సీతారామసాగర్‌ను ఎందుకు పూర్తి చేయలేదు..
సాగునీటి ప్రాజెక్టులపైన ఒక లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేశారు. 40 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు..
పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేస్తే దానిపైన కూడా కడుపుమంట, కళ్లు..
కృష్ణా నీటిని శాశ్వతంగా చంద్రబాబుకు, జగన్‌కు తాకట్టు పెట్టారు..
కృష్ణా జాలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంత నష్టం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగింది..
అసెంబ్లీలో చర్చ పెడితే రావడం లేదు..
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమా?
మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కట్టాలని నిపుణులు చెబుతున్నారు..
గోదావరిపై ప్రాజెక్టులు కట్టలేదు..
ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నదే ఉద్దేశం.
వాళ్ల అవినీతి, దొంగతనాలపై చర్చ జరగొద్దు అన్నదే వాళ్ల ప్రయత్నం..
ఇంగితజ్ఞానం ఉపయోగించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి..
ఏపీ, మహారాష్ట్ర, బ్రిటన్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అక్కడ ఎందుకు ఎల్‌నినో ప్రభావం ఉంది?
అబద్ధాలతోనే అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో ఉన్నారు..
పదేపదే అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరు..
ఎప్పుడైనా అసెంబ్లీలో గోదావరి, కృష్ణా జలాలపై మేం చర్చకు సిద్ధం..
నీటి హక్కులను ఏ విధంగా హరించారో చర్చించడానికి మేం సిద్ధం..
అబద్ధాలు చెప్పడం ఆపనంతకాలం మేం నిజాలు చెబుతూనే ఉంటాం..
మేం నిజాలు చెబితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు..
కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు ఒక కాలువ తవ్వారు. పాంచపాండవుల చెరువు నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 400 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు..
కేసీఆర్‌కు ఎందుకు ఈ ప్రత్యేకమైన సౌకర్యం ఉంది?
దీనిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేద్దామా?
కేసీఆర్‌కు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
పంపుల కనెక్షన్‌ను తొలగించడానికి కేసీఆర్ ముందుకు వస్తారా?
పంచపాండవుల చెరువు నుంచి నీళ్లు ఎవరి పొలాలకు వెళ్తున్నాయో చూసి తెలంగాణ ఎవరి పాలైందో చెప్పాలి..
విద్యుత్ సంక్షోభం రాబోతుందని 1,040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేసీఆర్ హడావుడి చేశాడు..
నామినేషన్ బేసిస్‌పై ప్లాంట్లు ఇస్తున్నట్లు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు..
ఇందులో అవినీతి ఉందని మేం వ్యతిరేకించాం..
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై విద్యుత్ రంగ నిపుణుడు రఘుతో పాటు అందరం వ్యతిరేకించాం..
యాదాద్రి సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు కట్టడానికి రూ.17,950 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు..
మూడేళ్లలో కడతామని బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకున్నారు..
యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం రూ.37,781 కోట్ల వ్యయం పెరిగింది. 110 శాతం అంచనాలు పెరిగాయి..
తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఒక యూనిట్‌కు ఖర్చవుతోంది..
అదే సమయంలో భద్రాద్రిలో ఎన్టీపీసీ కేవలం రూ.7.50 కోట్లతో యూనిట్‌ను పూర్తి చేసింది..
ప్రతి మెగావాట్‌కు రెండు కోట్ల రూపాయల అంచనా పెరిగింది. దీనికి బాధ్యులు ఎవరు?
8 వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఎవరు తిన్నారు?
50 శాతం ఇంపోర్టెడ్ బొగ్గు, సింగరేణిలో జీ9 బొగ్గుతో యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు..
విదేశీ బొగ్గు గురించి మేం మాట్లాడలేదు..
కేసీఆర్ హయాంలో ఎంఎస్‌పీసీతో 2016లో ఒప్పందం చేసుకున్నారు..
యాదాద్రికి కావాల్సిన 14 మిలియన్ టన్నుల బొగ్గులో 7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గు కోసం డిసెంబర్ 9, 2016న ఒప్పందం చేసుకున్నారు..
గ్రేడ్ 9 బొగ్గును దిగుమతి చేసుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు..
బొగ్గు ఉత్పత్తి చేసే దగ్గరే పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తారు..
బొగ్గు, నీళ్లు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు కడతారు..
సింగరేణి ప్రాంతంలో కాకుండా దామరచర్లలో యాదాద్రిని నిర్మించారు..
గ్రేడ్ 9 వద్దు, ఏదైనా నడుస్తుందని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు..
గ్రేడ్ 9 నుంచి గ్రేడ్ 18 వరకు వివిధ రకాల బొగ్గు ఉంటుంది..
గ్రేడ్ 9 కాకుండా మిగిలిన రకం బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడితే బూడిద ఎక్కువగా వస్తుంది..
7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గు తెస్తున్నామని 2016లో రైల్వేకు ఒక లేఖ రాశారు..
ఈ ఒప్పందాల వెనుక ఉన్న ప్రతిభావంతుడు ఎవరు?
నమస్తే తెలంగాణలో 100 కోట్లు పెట్టి షేర్లు కొన్నది ఎవరు? ఆ ముసుగు వీరుడు ఎవరు?
దిగుమతి బొగ్గుపై విచారణ కావాలని కేటీఆర్ లేఖ రాశారు..
దిగుమతి బొగ్గుపై ఏ విచారణకైనా ఆదేశించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ విచారణ కావాలో కేటీఆర్ అడగాలి..
ప్రజా కోర్టు ముందు బహిరంగ విచారణకైనా సిద్ధం.
సింగరేణిని నిండా ముంచి ఈ ప్రాజెక్టును కట్టారు..
యాదాద్రి ప్రాజెక్టును మణుగూరు ప్రాంతంలో కట్టి ఉంటే ఖర్చు తగ్గేది..
యూనిట్ రూ.4.62కు మణుగూరులో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది..
యూనిట్ రూ.3.94కు కొత్తగూడెంలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది..
సింగరేణి1,2 లో యూనిట్ కు రూ.4.05కు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది..
యాదాద్రిలో యూనిట్ రూ.6.60కు ఉత్పత్తి అవుతోంది..
రూ.2.20 అదనంగా పడుతోంది..
యాదాద్రి వల్ల 50 వేల కోట్ల అదనపు భారం పడుతుంది..
వచ్చే 25 ఏళ్లలో లక్ష కోట్ల నష్టం జరుగుతుంది..
ఏ బొగ్గైనా వాడొచ్చునని మిక్సాలిజిస్టు చెపుతున్నాడు..
మిక్సాలజిస్ట్‌ను మొదటిసారి చూస్తున్నాం..
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఒక ముసుగు వీరుడిని తయారు చేశారు..
విదేశాల నుంచి దిగుమతి చేయాలన్న ఆలోచనపై విచారణకు సిద్ధం..
కేటీఆర్ రాసిన లేఖ ఆధారంగా విచారణకు సిద్ధం..
సింగరేణిలో జీ9 బొగ్గు లభ్యత 2 మిలియన్ టన్నులు మాత్రమే..
141 టెండర్లు జరిగితే ఒక్కదాంట్లో కూడా సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది..
దిగుమతి బొగ్గు కోసం టెండర్లలో పాల్గొనలేదు..
100 శాతం దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్జీటీలో కేసు వేయించి స్టే ఇప్పించారు..
మొత్తం 14 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు..
2024లో ప్రజాభిప్రాయ సేకరణ చేపించి, సింగరేణి బొగ్గును మాత్రమే వాడుతామని తీర్మానం చేయించి ఎన్జీటీలో స్టే ఎత్తివేయించాం..
యాదాద్రిలో ఐదో యూనిట్ ఇంకా పూర్తి కాలేదు..
నైనీ కోల్ నుంచి రోజుకు రెండు, మూడు ర్యాక్‌లు తీసుకొచ్చి యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టాం..
బొగ్గు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఈ రోజు నేను మాట్లాడాను..
దేశీయ బొగ్గునే యాదాద్రిలో వాడటానికి మేం ప్రయత్నాలు చేస్తున్నాం..
డ్రగ్స్, ఫామ్‌హౌస్, స్టార్ హోటళ్లు, 22 ఏ వంటి అంశాల్లో కేటీఆర్ బుకాయించడానికి ప్రయత్నం చేశారు..అన్నం తినేవాడు ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించాలి..అదే ఆసుపత్రిని కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రారంభించారు..ప్రారంభించినవన్నీ నావే అయితే ప్రపంచంలోనే శ్రీమంతుడిని అవుతాను..అవినీతిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధం.

