Tuesday, October 20, 2026
Homeతెలంగాణసిరిసిల్ల సీఎం సభకు గాంధీనగర్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

సిరిసిల్ల సీఎం సభకు గాంధీనగర్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

 కరీంనగర్ కలెక్టర్ నూతన భవన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం  గాంధీనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ నూతన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో గాంధీనగర్ గ్రామ పంచాయతీ పరిధి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

అలాగే సిరిసిల్లలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశ సభకు హాజరయ్యేందుకు గాంధీనగర్ గ్రామ కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరారు. గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం కనకయ్య పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా సభకు తరలివెళ్లారు.

సీఎం సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.