Monday, October 19, 2026
Homeతెలంగాణఎయిర్‌పోర్టుకు శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పేరు

ఎయిర్‌పోర్టుకు శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పేరు

📰 Generate e-Paper Clip

మామునూరు విమానాశ్రయానికి నామకరణం చేయాలని శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి విజ్ఞప్తి

భీమ్ ఇండియా టుడే న్యూస్ వరంగల్ మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకుంటుండటం సంతోషకరమైన విషయమని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి అన్నారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి ద్వారా వరంగల్ ప్రజల భవిష్యత్తుకు ఉజ్వల బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రాంతానికి విమాన రాకపోకలు పెరిగి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వరంగల్‌కు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఈ ప్రాంత వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే అవకాశం ఉంటుందని అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో వెలసిన శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పీఠానికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు. శ్రీ జగద్గురు రేణుకాచార్యుల స్వయంభు పంచాచార్య పీఠం వీరశైవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.జగద్గురు రేణుకాచార్యులు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలను అందించిన మహనీయులుగా వీరశైవ సంప్రదాయంలో గౌరవింపబడుతున్నారని తెలిపారు. అలాంటి మహనీయుని పేరును అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి పెట్టడం ద్వారా తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయవచ్చని అన్నారు.అందువల్ల వరంగల్ మామునూరు విమానాశ్రయానికి **‘శ్రీ జగద్గురు రేణుకాచార్య ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’**గా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి, కొలనుపాక శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పీఠం ప్రాశస్త్యాన్ని గుర్తిస్తూ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసి వరంగల్ ప్రజలకు త్వరితగతిన విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.విమానాశ్రయానికి శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పేరు పెట్టడం ద్వారా వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.