భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి . ఈరోజు ఏఐటీయూసీ.4 వ. జిల్లా మహాసభలు ఈరోజు కామారెడ్డి పట్టణం లోటరీ క్లబ్ లో మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ బాలరాజు జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ మాసభకు . ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజు అధ్యక్షతన వహించగా. ఈ మహాసభలు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మికుల పట్ల విధానాలపై మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు లేక కార్మికుల చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకుందని కార్మికులకు పని గంటలు పని భద్రత కల్పించడం లేదని అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు ఉండాలని కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉండాలని అదేవిధంగా కార్మికులు మూడు పూటలా తిండి కార్మికునికి కనీస అవసరాలు వేతనం పిల్లల చదువులు ఉన్నత వర్గం పేద వర్గం ఒకేలా ఉండాలని ఆమె అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు
ఇప్పటికైనా కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడంలేదని అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుందని ఆమె అన్నారు కనీస ధరలు నిత్యవసర ధరలు అనేక ధరలు పెరగడం వల్ల నిరుపేద కార్మికులు బతికే పరిస్థితులు లేరని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కార్మికులు బతకడానికి కనీస వేతనాలు ఉండాలని ఆమెన్ య మహాసభల్లో అన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న . ఏఐటీయూసీ సంఘం అని కామారెడ్డి చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు అదేవిధంగా నాలుగోవ జిల్లా మహాసభలకు ముఖ్య అతిధులుగా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు ఇప్పటికైనా కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు అదేవిధంగా కార్మికుల సమస్యలు భవిష్యత్తులో పరిష్కారానికి ముందుంటానని మహాసభల్లో పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ నాలుగో రోజు జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు ముందు ముందు కార్మికుల సమస్యల పైన పరిష్కార దిశగా పనిచేస్తానని ఆమె మహాసభల్లో మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వము పెంచిన నిత్యవసర దళాలను ఇతర ధరలు పెట్రోల్ గ్యాస్ అదేవిధంగా రైతుల సమస్యలను కార్మికుల సమస్యలు పరిష్కారమే వరకు పోరాటాలు నిర్వహించాలని ఆమె మాట్లాడడం జరిగింది అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఏఐటీయూసీ ఎస్ బాలరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానీ ఆదాని అనుకూలంగా కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుందని కనీసం మనిషి బతకడానికి కనీస వేతనం లేక కార్మికుడు కార్మికుడుగానే మిగిలిపోతున్నారని ఆయన అన్నారు జిల్లా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నల్లధనాన్ని తీసుకురావాలని పెంచిన ధరలు తగ్గించాలని కార్మికుల 44 చట్టాలను నాలుకోడ్లుగా విభజించడాన్ని సరైంది కాదని ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మేల్కోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని ఆయన అన్నారు ఏఐటీయూసీ నాలుగవ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6 నుండి 8 వరకు కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6న భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్ జీత్ కౌర్ హాజరవుతారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ బాలరాజు అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడేనాడాలని లేనియెడల భవిష్యత్తులో కార్మిక వర్గం జరిగే పోరాటాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాల నలుమూలల నుండి మహాసభల్లో పాల్గొనడం జరిగిందని కార్మిక వర్గానికి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్ బాలరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్ లక్ష్మణ్ జిల్లా నాయకులు ప్రవీణ్ రఫిక్ శ్రీనివాస్ భీమయ్య బాజీ రాజిరెడ్డి దుబాస్ రాములు ఆర్ లక్ష్మణ్ జి రాజు రాజేందర్ సునీత విజయలక్ష్మి అనిత రాజ్యలక్ష్మి లావణ్య. భీమయ్య బాజీ. శ్రీనివాస్ కృష్ణ రాజేందర్ బాల్రాజ్ ఖదీర్ వెంకట్ గౌడ్ శివాజీ దేవరాజు గంగయ్య రాములు ఈ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో మహాసభలో పాల్గొనడం జరిగింది

