HomeEditorialహనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ Editorial హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ By Reporter Srikanth July 25, 2026 0 36 Share FacebookTwitterPinterestWhatsApp 📰 Generate e-Paper Clip బీమ్ ఇండియా టుడే ఎన్జీవోస్ కాలనీ :హనుమకొండ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘విజయ్ మార్చ్’ పేరిట కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి కారణం అన్నారు. నీట్ పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం నీట్ ప్రశ్న పత్రం లీకేజీతో మరణించిన విద్యార్థులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీపీసీసీ నేతలు ఈవీ శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, బి. ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 📰 Share Epaper Clip Share FacebookTwitterPinterestWhatsApp Previous articleకార్పొరేట్ సంస్థలు పేదలకు మరింత సేవలందించాలిNext articleయువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ RELATED ARTICLES Editorial ప్రజాకవి కాళోజీ ఆశయాలను కొనసాగించడమే మన బాధ్యత September 9, 2026 Editorial ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి September 9, 2026 Editorial విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యం: September 5, 2026 Most Popular బసవరాజు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. September 11, 2026 తాత మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి September 11, 2026 సూరారం గ్రామానికి అండర్పాస్ నిర్మించాలి September 11, 2026 కక్షిదారులు సద్వినియోగం చేసుకొవాలి September 11, 2026 Load more