ప్రజావాణిలో ఎంపీడీఓకు వినతి
గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ కార్యదర్శికి విజ్ఞప్తి
భీమ్ ఇండియా టుడే న్యూస్ సైదాపూర్: సైదాపూర్ మండలంలోని సైదాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు పొడిశెట్టి అజయ్, వంగ తిరుమలేష్, పొడిశెట్టి అరుణ్ కుమార్ ప్రజావాణిలో ఎంపీడీఓకు వినతి సమర్పించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని వార్డు సభ్యులు కోరినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు చొరవ చూపాలని వారు కోరారు.

