Tuesday, October 20, 2026
Homeతెలంగాణఈ-హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల డేటా నమోదు

ఈ-హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల డేటా నమోదు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 15 నాటికి డిజిటల్ రికార్డుల నమోదు పూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  తెలంగాణలో మరింత పారదర్శక పరిపాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్) ద్వారా పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ-హెచ్ఆర్ఎంఎస్ అమలు, ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ విధానాలపై గురువారం హైదరాబాద్ లోని బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు, ఏసీఆర్ లు, ఇతర ఉద్యోగ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటాను ఈ-హెచ్ఆర్ఎంఎస్ లో నమోదు చేస్తున్నట్టు అధికారులు సీఎస్ కు వివరించారు. మొత్తం 38,710 కార్యాలయాలకు సంబంధించిన డేటాలో ఇప్పటికే 93 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. మిగిలిన ప్రక్రియను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, వేగం, సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్ లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులను డిజిటల్ విధానంలోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల ప్రక్రియను కూడా ఆన్ లైన్ లో నిర్వహించాలన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజినీర్ (సీఈ) వరకు సాంకేతిక అనుమతుల ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులకు నేరుగా అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) మంజూరులను ఆధార్ ధృవీకరణతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిజిటల్ పాలనకు నోడల్ అధికారులు

ఈ-హెచ్ఆర్ఎంఎస్ఈ పాటు అన్ని డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సూచించారు. డిజిటల్ వ్యవస్థల అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా శాఖల వారీగా సమన్వయం ఉండాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు బీఎండీ. ఎక్కా, సభ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, అహ్మద్ నదీం, క్రిస్టినా చొంగూ, శిఖాగోయల్, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, లోకేష్ కుమార్, దివ్య దేవరాజన్, సురేంద్ర మోహన్, హరిచందన, ఈ. శ్రీధర్, సిక్తాపట్నాయక్, విజయేంద్ర, సమాచార, పౌరసంబంధాల స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.