Monday, October 19, 2026
Homeతెలంగాణదర్శకుడిగానే కాకుండా రచయితగా,

దర్శకుడిగానే కాకుండా రచయితగా,

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ లో సినీ రంగంలో   ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు.

 దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి  ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.