Monday, September 14, 2026
Homeతెలంగాణసిద్ధి వినాయకుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

సిద్ధి వినాయకుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే ఎల్కతుర్తి, సెప్టెంబర్ 14:మండలం ఎల్కతుర్తి గ్రామంలో సిద్ధి వినాయక అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విగ్రహ దాత, మాజీ సర్పంచ్ గడ్డం రవి, కొమరమ్మ 9వ వార్డు సభ్యులు నాంపల్లి మమత–అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కోరే బ్రదర్స్, గడ్డం బ్రదర్స్, పాలడుగుల బ్రదర్స్, వల్లాల బ్రదర్స్, యూత్ బీఆర్ఎస్ అధ్యక్షులు బొజ్జ నవీన్, మండల జాగృతి అధ్యక్షులు గుడిశాల విక్రమ్ గౌడ్ పాటు యువకులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు.

గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.