Thursday, September 10, 2026
Homeతెలంగాణఈ నెల 10న చలో హైదరాబాదు మహా ధర్నాను విజయవంతం చేయండి

ఈ నెల 10న చలో హైదరాబాదు మహా ధర్నాను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పిలుపు ఈ నెల 10న చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమానికి టీజీ ఈ జేఏసీ పిలుపు ఇచ్చిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో టా ప్ర హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశము నిర్వహించనైనది. ఇట్టి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణ చారి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నూతన పి ఆర్ సి జూలై 2023 నుండి అమలు,పెండింగ్ డి ఏ ల విడుదల,సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు,పెన్షనర్ల పెండింగ్ బిల్లుల మంజూరి,నూతన ఈ హెచ్ ఎస్ విధానము ఏర్పాటుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి టి జి ఈ జెఎసి ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాదు మహాధర్నాను విజయవంతం చేయుటలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరి నారు.ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కొరకు గత నెల 27న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కదిలి రాకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్త పరచినారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారం కొరకు స్పందించాలని లేనిచో తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించినారు. టీజీ ఈ జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 10న హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసినారు. ఇట్టి సమావేశంలో టా ప్ర హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, టీ కనుకయ్య, బి వెంకటయ్య,డి హరి కిషన్, ఎం మొగిలయ్య, సిహెచ్ మల్లారెడ్డి, జి సాంబయ్య, జి బుచ్చి రాజం, శబ్ద ప్రకాష్, రవీందర్ రెడ్డి,జి గంగయ్య, జి స్వామి రెడ్డి, యు రాజేశం, ఎన్ రాజిరెడ్డి, సిహెచ్ సమ్మిరెడ్డి, సురేష్ బాబు,పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.