Saturday, September 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వీధి నాటకం ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన..

వీధి నాటకం ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన..

📰 Generate e-Paper Clip

వీధి నాటకం ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన..

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ , నియంత్రణ సంస్థ నేతృత్వంలో గొర్రెల శ్రీనివాస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగంగా గురువారం మండల కేంద్రమైన ఆలమూరు, కొత్తూరు సెంటర్, మడికి ప్రధాన కూరగాయల మార్కెట్ సర్కిల్ నందు వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి,ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు , చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 గూర్చి ప్రజలలో గొర్రెల శ్రీనివాస్ కళాజాత బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, దిశ సిఎస్ఓ బుజ్జి బాబు, లింక్ వర్కర్ స్కీమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు._

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.