భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఇందువెంట సమస్త హుజురాబాద్ పట్టణ గౌరవ రాష్ట్ర అటవీ శాఖా మంత్రివర్యులు గారి ఆదేశముల మేరకు తేదీ: 25-08-2026 రోజున వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారి ఆధ్వర్యంలో పురపాలక సంఘము పరిధిలోని కరీంనగర్ ప్రధాన రహదారి ప్రక్కన గల మహాలక్ష్మీ ఫంక్షన్ హాలు నుండి లవ్ హుజురాబాద్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారు, గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి గూడూరి అంజలి గారు, గౌరవ వార్డు కౌన్సిలర్లు మరియు గౌరవ కో-ఆప్షన్ సభ్యులు, పురపాలక సంఘ కమిషనర్ శ్రీ బి. కిషన్ గారు, మేనేజర్ శ్రీ ఆర్. భూపాల్ రెడ్డి గారు, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శ్రీ పి. వినయ్ గారు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు
కమిషనర్ హుజురాబాద్ మునిసిపాలిటీ.

