Thursday, September 17, 2026
Homeఅంతర్జాతీయంహైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు

హైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలోని ఈ బృందం తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది.

 సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గారు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ గారు పాల్గొన్నారు.

  •  హైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను ఆహ్వానించారు.

 కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు గారు, వెంకట సిరీష్ గండికోట గారు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అవకాశాలపై సానుకూలంగా స్పందించారు.

 హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.

 కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఇది మరింత బలం చేకూర్చనుంది.

: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని లండన్‌లో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్ గారు, నూలా గల్లాఘర్‌ గారు, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి చూపింది.

ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారుచేయడానికి లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.