Friday, August 28, 2026
HomeEditorialచట్టసభల్లో కళాకారులకు వాటా కావాలి.. పాటకు గౌరవం దక్కాలి

చట్టసభల్లో కళాకారులకు వాటా కావాలి.. పాటకు గౌరవం దక్కాలి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ రవీంద్ర భారతి చట్టసభల్లో కళాకారులకు వాటా కావాలి.. పాటకు గౌరవం దక్కాలి చట్టసభల్లో కళాకారులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని, పాటను ప్రజా ఉద్యమానికి ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా న్యాయం జరగాలని బరిపాటి రాములు సింగారం రవీందర్, సురేష్ మహాజన డిమాండ్ చేశారు.**“ఏపూరి పాటల ప్రవాహ సభ లో వారు తమ ఆవేదనను, డిమాండ్‌ను గళమెత్తి వినిపించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన అనేక మంది కళాకారుల ఆవేదనలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని సింగారం రవీందర్ అన్నారు. ఇకపై ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కళాకారులకు న్యాయం చేయాల్సిందేనని, చట్టసభల్లో వారికి తగిన వాటా, హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

 బరిపాటి రాములు తెలంగాణ.. ఉద్యమాల్లో కళాకారులు పోషించిన పాత్రను గుర్తు చేశారు. గద్దర్ అన్నను స్మరిస్తూ, జెండాలు మోసిన జనాన్ని సమీకరించి, సభలు నిర్వహించి, కరపత్రాలు పంచి, పోస్టర్లు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన కళాకారుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన” అంటూ ప్రజల తరఫున గళమెత్తిన పాటలు, బండి యాదగిరి పాటలు, గద్దర్ పాటలు, విమలక్క డప్పు పాటలు, జయరాజన్న పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల గొంతుకగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం బలహీనంగా ఉన్న సందర్భాల్లో కూడా ప్రజల తరఫున ప్రశ్నించిన పాటలే నిజమైన ప్రతిపక్షంగా నిలిచాయని అన్నారు.

ప్రత్యేకంగా ఏపూరి సోమన్న పాటలు ప్రజల సమస్యలను, తెలంగాణ ఆవేదనను, పాలకులను ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజల్లో నింపాయని  తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రైటర్ గా గుర్తింపు పొందిన సింగారం రవీందర్  సూర్యాపేట రాములు సురేష్ మహాజన అన్నారు.

అన్నీ ఇస్తున్నారు గాని తమ్ముడా.. అధికారం ఎందుకు ఇవ్వరు? అడుగుదాం లేచిపోరా” అనే భావంతో కళాకారుల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.  పాటను వినోదంగా మాత్రమే కాకుండా ప్రజల సమస్యలను ప్రతిబింబించే శక్తివంతమైన మాధ్యమంగా గుర్తించాలని, ఉద్యమాల్లో ముందుండి నడిచిన కళాకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.

చట్టసభల్లో కళాకారులకు వాటా దక్కే వరకు తమ పోరాటం ఆగదని సభలో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.