Friday, August 28, 2026
Homeతెలంగాణరాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాం

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాం

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ        భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగ‌ర్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు.

నాగార్జునసాగర్‌ డ్యామ్‌ తీరంలోని విజయవిహార్‌ ప్రాంగణంలో యాగం నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహిస్తారు.

కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరుగుతుంది. యాగం అనంత‌రం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.