Friday, August 28, 2026
HomeEditorialఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

📰 Generate e-Paper Clip

వారంలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే షురూ! – హైదరాబాద్ నుంచి విశాఖకు తగ్గనున్న 56 కిలోమీటర్ల దూరంభీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ :- త్వరలో ప్రారంభం కానున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే – పూర్తయిన ఆర్వోబీల నిర్మాణం – ప్రస్తుతం లోడ్ టెస్టింగ్ చేస్తున్న అధికారులు – ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 56 కిలోమీటర్లు తగ్గనున్న దూరం

ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-365 బీజీ) మరో వారం రోజుల్లోనే పూర్తి స్థాయిగా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఇది వరకే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికీ, ధ్వంసలాపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల పనులు నెమ్మదించాయి. దీంతో కొంతకాలంగా వైరా నుంచి దేవరపల్లి వరకు టోల్‌ప్లాజాలను తెరచి రవాణాకు అనుమతించారు. తాజాగా ఎడమ వైపు ఆర్వోబీ నిర్మాణం పూర్తవడంతో దాని మీదుగా రాకపోకలు కొనసాగించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వివరాలివే :

సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు ఖమ్మం జిల్లాలోకి రాగానే తెల్దారుపల్లి దగ్గర ఉన్న టోల్గేట్ ద్వారా గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి ప్రవేశిస్తాయి. చివరగా దేవరపల్లి సమీపంలో నిష్క్రమణ (ఎగ్జిట్) గేటు నుంచి దిగుతాయి.ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్యలో ఉండే ప్రధాన పట్టణాల దగ్గర హైవే కింద మరో తొమ్మిది టోల్ ప్లాజాల నుంచి కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి ఎంట్రీ, ఎగ్జిట్ కావచ్చు.ఈ గ్రీన్ ఫీల్డ్పై సాధారణ హైవేల మాదిరిగా టోల్ ట్యాక్స్ వసూలు చేయరు. వాహనం ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు ఉండే దూరాన్ని బట్టి మాత్రమే వసూలు చేస్తారు. ఉదాహరణకు ఓఆర్ఆర్ తరహాలో ఉంటుంది.హైవే పొడవునా ప్రతి కిలోమీటరుకు ఒక సీసీ కెమెరాను అమర్చారు. వందనం, చౌడవరం సమీపంలో భారీ గూడ్స్ వాహనాలు నిలిపేలా ట్రక్ లే బైలు కూడా ఏర్పాటు చేశారు.ఈ హైవేకు అమరావతి నుంచి నాగ్పూర్ వెళ్లే మరో గ్రీన్ ఫీల్డ్ హైవే వందనం-కొదుమూరు దగ్గర అనుసంధానమవుతుంది. ఇక్కడ కూడా రెండు హైవేల రవాణాకు అంతరాయం కలగకుండా క్లోవల్ లీఫ్ రోడ్డు నిర్మించారు. దీని ద్వారా పరస్పరం ఒక హైవే నుంచి మరో హైవేకు సులభంగా మారొచ్చు.ఈ హైవేపై వాహనాన్ని బట్టి 80, 100 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణించొచ్చు.

తగ్గనున్న 56 కిలోమీటర్ల దూరం :ఈ గ్రీన్ ఫీల్డ్ను ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పచ్చని పంట పొలాల మీదుగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునేలా రూపొందించారు. దీని కోసం 162.04 కిలోమీటర్ల మేర 4 వరుసల రోడ్డును నిర్మించారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 105 కిలోమీటర్లు కాగా, 3 ప్యాకేజీల్లో రూ.2,213.91 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.

లోడ్ టెస్టింగ్ :ఈ హైవేలో సంవత్సరం కిందటే అండర్ పాస్లు, రహదారులు పూర్తయ్యాయి. ఆర్వోబీల వల్ల దీని ప్రారంభానికి జాప్యం నెలకొంది. ఇటీవల ఎడమ వైపు ఉన్న ఆర్వోబీ నిర్మాణం పూర్తవడంతో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారులు లోడ్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇది పూర్తయితే మిగితా పెండింగ్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు తొలుత ఆగస్టు 1నే హైవేపై రాకపోకలు ప్రారంభించాలని భావించారు. కానీ ఇంకా రెండు, మూడు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్లో ఉన్న ఆర్వోబీలపై ప్రస్తుతం లోడ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నాం. ఇది పూర్తయిన తర్వాత రంగులు వేస్తాం. ఒకే దారిలో రాకపోకలు సాగించే వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. అనంతరం హైవేపై రాకపోకలు కొనసాగించేందుకు అనుమతిస్తాం” – దివ్య, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ, ఖమ్మం

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.