BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:02 pm Posted by : Reporter Srikanth

RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ నియామకం

జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ నియామకం

భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం (RTI) అమలును మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బి. చంద్రశేఖర్, ఐ.ఏ.ఎస్. అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీకి నామినేట్ చేయడం జరుగుతుంది.

ఇందులో భాగంగా వివిధ రెవెన్యూ డివిజనల్ అధికారుల (RDO) ప్రతిపాదనలను పరిశీలించి, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రొసిడెంఛియల్ నెం. A5/11318/2016-2026 ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ సొసైటీ (RTIAS) రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ (తండ్రి: భద్రు, నివాసం: హెచ్.నెం. 6-23, గూండ్లపల్లి మండలం, కొత్తతండా గ్రామం) ఈ కమిటీ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు, RTIAS కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం–2005ను ప్రభుత్వ కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005కు సంబంధించిన బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాల నోటీసు బోర్డులపై, అలాగే ఇతర అందుబాటులో ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా స్వచ్ఛందంగా వెల్లడించాలని సూచించారు.

ప్రజలు సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని అన్నారు. ప్రభుత్వ విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునే విధంగా పారదర్శక పాలనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజల్లో ఈ చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు RTIAS సంస్థ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

తనకు జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీలో సభ్యునిగా అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బి.చంద్రశేఖర్, ఐ.ఏ.ఎస్. గారికి డా. కొర్ర కిషన్ నాయక్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.