BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:52 pm Posted by : Reporter Srikanth

సీతా మహాలక్ష్మి నేతృత్వంలో మంత్రి దామోదర రాజనర్సింహ కి వినతి

GO No:124 అమలు మరియు అవయవ,శరీర దాతల సంక్షేమానికి కీలక ప్రతిపాదనలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకులు డా. గూడూరు సీతా మహాలక్ష్మి గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు డా. కాట్రగడ్డ భారతి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు నేడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని కలిసి పలు కీలక ప్రతిపాదనలతో వినతిపత్రం సమర్పించారు.

ప్రధానంగా GO No.124 (07-08-2025) క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే శరీరదానానికి రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి విధానంతో పాటు  అవయవ దాత కుటుంబాలకు కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని రూ.10 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారితో చర్చలు జరుపుతున్న అఖిల భారత శరీర అవయవదాతల సంఘ ప్రతినిధులు..

ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత విధివిధానాల రూపకల్పనతో ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కన్వీనర్ ఎల్.వి. కుమార్, నేషనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ మేకల యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ PSM కేజియా,రాష్ట్ర నాయకులు రామ్ మోహన్ గౌడ్, అనూరుద్ర రెడ్డి, విజయశ్రీ, సముద్రాల ధనుంజయ, పసుమర్తి మల్లికార్జున్, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.