Date of Publish : 11 November 2026, 6:27 pmPosted by : Reporter Srikanth
వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తి రెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో తోట లలిత–మొగిలి దంపతుల కుమారుడు శివకుమార్, మానస వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులు శివకుమార్, మానసలను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని వారు ఆకాంక్షించారు. నూతన జీవితంలో అడుగుపెట్టిన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ గాలిఫ్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.