దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు చేయలేదు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రొబేషనరీ డీఎస్పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.  పది మంది డీఎస్పీలు అరాచకంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో పరిపాలన, ప్రభుత్వం లేదని, శాంతిభద్రతలు క్షీణించడమే కాకుండా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు రావొచ్చు. అదే పది మంది డీఎస్పీలు నిటారుగా నిలబడి విధులు నిర్వర్తిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ...