BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:23 am Posted by : Reporter Srikanth

కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన పర్యటన మూడో రోజున రూ. 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

వీటిలో ప్రధానంగా రహదారులు, సాగునీరు, విద్య, వ్యవసాయం, రవాణా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తూ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు.

మౌలిక వసతుల విస్తరణతో పాటు విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అవకాశాలను పెంపొందించేలా చేపట్టిన ఈ ప్రాజెక్టులు నియోజకవర్గ భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా నిలవనున్నాయి.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

కొత్వాల్ గూడ నుంచి నాచారం వరకు రూ. 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు -2 నిర్మాణం.

ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 1,410 కోట్లతో 223 కొత్త బీటీ రహదారులు, అసంపూర్తి రహదారుల పనులు.

రూ. 2,100 కోట్లతో మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ (#MNKLIS) రెండో దశ పనుల ప్రారంభం.

విద్యా రంగంలో రూ. 118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు,

రూ. 123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం.

రూ. 41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్లు,

రూ. 20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.

రూ. 20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం.

రూ. 59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు తిమ్మారెడ్డిపల్లిలో రూ. 4.45 కోట్లతో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధి. కొడంగల్‌లో రూ. 5.10 కోట్లతో నిరంజన్ మఠం అభివృద్ధి పనులు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ. 10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం. రూ. 81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం.