రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి
భీమ్ ఇండియా టుడే న్యూస్ సిద్దిపేట – హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందడం పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హుస్నాబాద్ *మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్* ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదమని, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు అలాగే వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స వెంటనే అందించాలని కోరారు ,
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను కోరారు. భగవంతుడు దయవల్ల తల్లి బిడ్డ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే
రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.